హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): బాగ్అంబర్పేటలోని బతుకమ్మ కుంట, అకడి స్థలం రాష్ట్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ స్థలంపై హకులు తమవేనని ఎవరైనా భావిస్తే సివిల్ కోర్టులో దావా వేసి తేల్చుకోవాలని స్పష్టం చేసింది. సర్వే నంబరు 563/1లోని 988, 983, 1925 చదరపు మీటర్లతో మూడు భాగాల స్థలం ప్రభుత్వానిదేనని తీర్పులో పేర్కొన్నది. ఈ స్థలం సయ్య ద్ జహంగీర్ తదితరులకు చెందినదని, వారి హకుల్లో అధికారులు జోక్యం చేసుకోరాదని, ఒకవేళ ప్రభుత్వానికి అవసరమైతే భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించి సేకరించుకోవచ్చంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైదరాబాద్ కలెక్ట ర్, ఇతర అధికారులు అప్పీలు దాఖలు చేశా రు. విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాసర్రెడ్డితో కూడిన ధర్మాసనం తాజాగా తీర్పు ఇచ్చింది.