హైదరాబాద్, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): తెలంగాణ సాంసృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు ఈ నెల 21 నుంచి 30వరకు జరుగనున్నాయి. వేడుకలకు సంబంధించిన పోస్టర్‌తోపాటు సావనీర్‌ను సోమవారం సచివాలయంలో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ , పంచాయతిరాజ్‌శాఖ మంత్రి సీతకతో కలిసి టూరిజం అండ్ సాంస్కృతికశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈసారి అపూర్వరీతిలో వేడుకలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.