బాసర : బాసరలోని ( Basara ) రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) 2025-26 లో ప్రవేశానికి నోటిఫికేషన్ ( Notifications ) విడుదల కానుందని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్లో ( B.Tech ) ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ను ఈనెల 28న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రవేశాల షెడ్యూల్ త్వరలో విశ్వవిద్యాలయ వెబ్సైట్లో వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు . వివరాలకు, తాజా సమాచారం కోసం విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ను www.rgukt.ac.in సందర్శించాలని సూచించారు.