Arrest | నిషేధిత మావోయిస్టు కొరియర్ల అరెస్ట్.. పేలుడు పదార్ధాలు స్వాధీనం
Arrest | నిషేధిత మావోయిస్టులకు సహాయ, సహకారాలు అందిస్తున్న ముగ్గురు కొరియర్లను ములుగు జిల్లా పోలీసులు అరెస్టు చేసి వారివద్ద నుంచి పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ములుగు : నిషేధిత మావోయిస్టులకు సహాయ, సహకారాలు అందిస్తున్న ముగ్గురు కొరియర్లను ములుగు జిల్లా పోలీసులు అరెస్టు చేసి వారివద్ద నుంచి పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత సీపీఐ మావోయిస్టులకు ( Banned Maoist)చెందిన అగ్రనాయకులు, దళ సభ్యులు వాజేడు గ్రామంలో రోడ్డు వర్క్ మిషన్లను తగల బెట్టేందుకు వ్యూహం వేశారని పోలీసులకు పక్కా సమాచారం అందింది.
వాహనాలను తగలబెడితే అటుగా వచ్చే పోలీసులను ల్యాండ్‌మైన్‌తో చంపివేయడానికి కుట్ర పన్నుతున్నట్లు సమాచారం అందిందని వెంకటపరం సీఐ శివప్రసాద్ తెలిపారు. దీంతో పోలీసు బలగాలతో ఆదివారం రాత్రి వాజేడు నుంచి గుమ్మడిదొడ్డి మార్గంలో ఫుట్ పెట్రోలింగ్ (Petrolling)చేస్తుండగా గ్రామ శివారులో ముగ్గురు అనుమానిత వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయే యత్నం చేశారని వివరించారు. వీరిని పోలీసులు పట్టుకుని విచారించగా వారి వద్ద పేలుడు పదార్ధాలు(Explosives) లభించాయని పేర్కొన్నారు.
వాజేడు మండలం ప్రగళ్లపల్లి గ్రామానికి చెందిన పుల్లూరి నాగరాజు, ఏటూర్ నాగారానికి చెందిన వావిలాల నర్సింగరావు, అదే గ్రామానికి చెందిన ఏంపెల్లి జాషువా అనే ముగ్గురు కొరియర్లను అరెస్టు చేశామని వివరించారు. కొరియర్ల వద్ద నుంచి డిటోనేటర్లను, సెల్ఫోన్లను, విద్యుత్ తీగలు,బ్యాటరీలను, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. వాహనాలను తగుల బెట్టడానికి పెట్రోల్‌తో పాటు నగదును ఇచ్చిన గుమ్మడిదొడ్డిలోని పెట్రోల్ బంక్ ఓనర్ కంబాలపల్లి గణపతిని కూడా అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

