నెల్లికుదురు, మార్చి 15: తీసుకున్న రుణం చెల్లించాలని డీసీసీబీ అధికారులు ఓ రైతును తీవ్రంగా వే ధించారు. బకాయి డబ్బులు కట్టకపోతే భూమిని వేలం వేస్తామని పొలంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడమేగాక గ్రామంలో కరపత్రాలు పంచి సదరు రైతును అవమానానికి గురిచేశారు. అధికారుల తీరుతో మనస్తాపం చెందిన రైతు కొంత భూమిని కుదువ పెట్టి బ్యాంకు అప్పు తీర్చా ల్సి వచ్చింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండ లం నైనాల గ్రామంలో చోటుచేసుకున్నది. బాధిత రైతు కథనం ప్రకా రం.. నెల్లికుదురు మండలం నైనాల గ్రామానికి చెందిన రైతు ఆకుల కు మారస్వామికి 4.15 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఆర్థిక పరిస్థితుల కారణంగా 2.28 ఎకరాల భూమిని లో మార్ట్గేజ్ చేసి వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ తొర్రూరు బ్రాంచీలో రూ.5 లక్షల రుణం పొందాడు.
రూ.3.75 లక్షల వరకు అప్పు తీర్చాడు. గతేడాది నుంచి ఆశించిన మేర దిగుబడి రాక, ప్రభుత్వం ప్రకటించిన రూ. 2 లక్షల రుణమాఫీ కాక, రైతుభరోసా జమ కాకపోవడంతో తీసుకున్న రు ణం చెల్లించలేకపోయాడు. ఆర్థిక పరిస్థితి బాగాలేనందున ఇప్పుడు చెల్లించలేనని, పంట అమ్మి రుణం చెల్లిస్తానని బతిమిలాడినా బ్యాంకు అధికారులు వినలేదు. నోటీసులు జారీ చేసి రైతు భూమిలో ‘ఈ భూమిని వేలం వేయుటకు స్వాధీన పర్చుకోవడమైనది’ అంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ నెల 18న నైనాల గ్రామ పంచాయతీ వద్ద వేలం వేస్తామని కరపత్రాలు పంచిపెట్టారు. ఈ చర్యతో సదరు రైతు గుండె ఆగినంత పనైంది. తీవ్ర మనస్తాపం చెందిన ఆయన మొత్తం 4.15 ఎకరాల్లో 1.27 ఎకరాలు తాకట్టు పెట్టి రూ.5 లక్షలు అప్పుతెచ్చి రుణం చెల్లించాడు. కరపత్రాలు పంచిన ఖర్చు రూ.2 వేలు కూడా రైతుపైనే వేశారు.