Bank Recruitment | హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీలో వివిధ విభాగాల్లో 1,267 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఫైనాన్స్, ఐటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ తదితర విభాగాల్లో మేనేజర్, మార్కెటింగ్ ఆఫీసర్, ఏజీఎం, సీనియర్ డెవలపర్, ఏఐ ఇంజినీర్ తదితర ఖాళీలు ఉన్నాయి. జనవరి 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు వెబ్సైట్ www.bankofbaroda.co.in చూడవచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో 600 ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ ఉత్తీర్ణులు లేదా ప్రస్తుతం ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నవారు అర్హులు. వయస్సు 21-30 ఏండ్ల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్స్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జనవరి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు వెబ్సైట్ https://bank.sbi చూడవచ్చు.