మోదీ హామీని మించి బ్యాంకు మోసాలు
దేశవ్యాప్తంగా ఏడేండ్లలో బ్యాంకు మోసాలు 5 ట్రిలియన్లను అధిగమించాయని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను 2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్లు చేస్తానని 2019 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రవచించిన మాటేమోగానీ, బ్యాంకు మోసాలు అంతకంటే ఎక్కువయ్యాయని ఎద్దేవాచేశారు
- దేశంలో ఏడేండ్లల్లో రూ.ఐదు ట్రిలియన్ల టోకరా
- బ్యాంకు ఎగవేతదారులపై చర్యలు తీసుకోవాలి
- లోక్‌సభలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి డిమాండ్
హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఏడేండ్లలో బ్యాంకు మోసాలు 5 ట్రిలియన్లను అధిగమించాయని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను 2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్లు చేస్తానని 2019 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రవచించిన మాటేమోగానీ, బ్యాంకు మోసాలు అంతకంటే ఎక్కువయ్యాయని ఎద్దేవాచేశారు. దేశంలో బ్యాంకు మోసాల అంశాన్ని సోమవారం 377 నిబంధన కింద లోక్‌సభలో ప్రస్తావించారు. ఈ బ్యాంకు మోసాలపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. భారత ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారమే 2020-21లో రూ.1.37 లక్షల కోట్ల బ్యాంకు మోసాలు జరిగాయని మండిపడ్డారు.
2021 మార్చినాటికి దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో రూ.4.92 ట్రిలియన్ల మోసాలు జరిగాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బ్యాంకులు ఇస్తున్న రుణాల్లో 4.5 శాతం రుణాలు ఎగవేతదారులకే వెళ్లాయని తెలిపారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రూ. 2.94 లక్షల కోట్ల మోసాలు జరుగగా, ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో రూ.86,355 కోట్లుగా నమోదయ్యాయని వివరించారు. ఇప్పటికైనా కేంద్ర ఆర్థికమంత్రి ఈ బ్యాంకు మోసాలపై జోక్యం చేసుకొని శాశ్వత పరిష్కారం కనుగొనాలని, మోసపోయిన సొమ్మును రికవరీ చేయించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

