Bank Strike | హిమాయత్‌నగర్ మార్చి 19: బ్యాంక్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈనెల 23 నుంచి 25 వర కు జరిగే సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎస్బీ యూ) పిలుపునిచ్చింది. బుధవారం నారాయణగూడలోని ఎస్బీఐ ఓఏ భవన్లో యూఎస్బీయూ కన్వీనర్లు కే ఆంజనేయప్రసాద్, బీఎస్ రాంబాబు మాట్లాడుతూ.. బ్యాంకింగ్రంగం నానాటికీ విస్తరిస్తున్నప్పటికీ తదనుగుణంగా నియామకాలు లేక పనిభారం పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశా రు.
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 2013 నుంచి 2024 వరకు లక్షకుపైగా ఉద్యోగులు తగ్గడంతో మెరుగైన సేవలు అందించలేకపోతున్నామని తెలిపారు. ప్రభుత్వరంగ బ్యాంకుల పరిరక్షణ కో సమే ఈ సమ్మె చేపడుతున్నట్టు స్పష్టంచేశారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన ఉద్యోగుల పనితీరు సమీక్షించే విధా నం, పీఎల్ఐ మార్గదర్శకాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌చేశారు. సమావేశంలో యూఎస్బీయూ నేతలు కేఎస్ శాండిల్య, ఐ కృష్ణంరాజు, శంకర్, వెంకటరామయ్య, ఫణి, అర్జున్ పాల్గొన్నారు.