Bandi Sai Bhageerath | మైనర్ బాలికపై లైంగిక వేధింపులతో పోక్సో కేసు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాడు. హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టుకు వేసవి సెలవులు ఉండటంతో వెకేషన్ బెంచ్‌లో బండి భగీరథ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మే 14వ తేదీన హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరపనుంది.
కాగా, కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విషయంలో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. బండి భగీరథ్ అరాచకాలపై, పోక్సో కేసు దర్యాప్తు పర్యవేక్షణాధికారిగా కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ గైక్వాడ్‌ను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వ ఆదేశాల మేరకు డీజీపీ ఆనంద్ సూచనలతో సైబరాబాద్ కమిషనర్ ఎం ర మేశ్ భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు ద ర్యా ప్తు పర్యవేక్షణాధికారిగా కూకట్పల్లి డీసీపీ రితిరాజ్‌ను నియమించారు. ఈ మేరకు సోమవా రం ఉత్తర్వులు సైతం వెలువడ్డాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఈ కీలక కే సును ఆమె దర్యాప్తు చేయనున్నారు. మొదట సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు మీడియాలో హడావుడి జరిగినా, చివరికి దర్యాప్తు పర్యవేక్షణాధికారిని నియమించడంతోనే ప్రభుత్వం సరిపెట్టుకున్నది. ఈ కేసు పురోగతిని రోజూ పర్యవేక్షిస్తూ, విచారణ నివేదికను నేరుగా కమిషనర్ కు సమర్పించాలని ఆదేశించారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టొద్దని పైకి చెప్తున్నా.. ఈ కేసును నీరుగార్చడం కోసమే ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపడుతున్నదని ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మీడియా నిశ్శబ్దాన్ని ఛేదించేలా కథనాలు
తన కొడుకుపై పోక్సో కేసు నమోదైందన్న విషయం తెలిసిన వెంటనే బీజేపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ కా ర్యాలయం నుంచి పలు మీడియా సంస్థలకు ఫోన్లు వెళ్లాయని, డిజిటల్ మీడియాకు, యూ ట్యూబర్లకు, మెయిన్‌స్ట్రీమ్ మీడియాలోని కొన్ని పత్రికలు, చానెళ్లకు ప్యాకేజీలు మాట్లాడేశారని ఆరోపణలొచ్చాయి. పోక్సో కేసు వార్తలు ప్రసారం చేయొద్దని, ప్రచురించవద్దని చెప్తూనే.. ఆ కేసును ఒక ‘హనీట్రాప్’గా చిత్రీకరించాలని సూచనలు అందాయి. కాసులకు కక్కుర్తిపడ్డ ఆ సంస్థలు అలాగే ప్రసారం చే శా యి. మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో నమస్తే తెలంగాణ, టీన్యూస్, తెలంగాణ టుడే, డిజిటల్ మీ డియాలో తెలుగుస్ర్కైబ్, మిర్రర్ వంటివి, పలు సోషల్ మీడియాలో పలు వేదికలు బాధితురాలి పక్షాన పోరాటమే చేశాయి. ప్రధాన వార్తా కథనాలు రోజంతా ప్రసారం చే యడంతో అసలు వాస్తవం ప్రజలకు తెలిసిం ది. బాధితురాలు తరఫున బీఆర్ఎస్ చేస్తు న్న పోరాటాన్ని ‘నమస్తే తెలంగాణ’ ప్రముఖంగా ప్రచురిస్తుండటంతో కాంగ్రెస్-బీజేపీ మైత్రికి బీటలు వారాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కేసులో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కలుగజేసుకోవాల్సి వచ్చింది. నాటి నుంచి నేటి వరకూ తెలంగాణ పక్షాన, బాధితుల తరఫున పోరాడుతున్న ‘తెలంగాణ మీడియా’కు అటు ప్రజల నుంచి, సోషల్ మీడియా నుంచి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.