పెద్దపల్లి టౌన్, ఏప్రిల్ 6: బాధ్యాతయుతమైన పదవిలో ఉన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ ప్రశ్న పత్రాల లీకేజీకి పాల్పడటం సిగ్గుచేటని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. గురువారం పెద్దపల్లిలో సీపీఐ నియోజకవర్గ సర్వసభ్య సమావేశానికి చాడ హాజరై మాట్లాడారు.
బీజేపీ అగ్రనాయకత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆయన్ను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బండి సంజయ్ చిచ్చు పెడుతున్నాడని దుయ్యబట్టారు.