హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి నరేంద్ర తెలంగాణ టూర్ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని తప్పించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇండియన్ పెట్రోలియం మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమ ఆహ్వాన పత్రిక నుంచి బండి పేరును తొలిగించినట్టు తెలిసింది.
బండి సంజయ్ కొడుకు భగీరథ్ పోక్సో కేసులో ఇరుక్కున్న నేపథ్యంలో ఆయనను ప్రధాని టూర్ నుంచి తొలగించినట్టు సమాచారం. అయితే సాయంత్రం సికింద్రాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగసభకు బండి హాజరు కావటంపై సందిగ్ధం నెలకొన్నదని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.