హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : ఫోన్‌ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ ఈ నెల 24న సిట్ విచారణకు హాజరుకానున్నారు. తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపిస్తూ.. గతంలో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో బండి సంజయ్, అతని పీఆర్వో, పీఏలకు సిట్ విచారణ నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్ లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో స్టేట్ మెంట్ ఇచ్చేందుకు బండి సంజయ్ అంగీకరించారు.