హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ముస్లిం బీసీ రిజర్వేషన్లను అమలు చేయరాదంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించడం హేయమని, రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ ముస్లిం బీసీ దూదేకుల సంఘం మండిపడింది. తక్షణం కేంద్ర మంత్రి క్షమాపణలను చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర సెక్రటరీ మహ్మద్ రాజమ్మద్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బండి సంజయ్ తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.