Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రసంగమంటే ఎట్లుంటదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతసేపు విద్వేషం రెచ్చగొట్టడం.. పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయడం తప్ప ఇంకోటి ఆయన ప్రసంగంలో కనిపించదు. ఆయన ప్రచారం చేస్తే తెలంగాణలోనే ఓట్లు రావడం కష్టం.. అసొంటిది పొరుగు రాష్ట్రం వెళ్లి ప్రచారం చేస్తే ఎట్లుంటది ! తాజాగా వచ్చిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చేస్తే బండి ప్రచారం చేస్తే ఎఫెక్ట్ ఎట్లుంటదో తెలుస్తుంది. అక్కడ ఆరు నియోజకవర్గాల్లో బండి సంజయ్ ప్రచారం చేస్తే ఒక్క చోట కూడా బీజేపీ గెలవలేదు సరికదా.. కనీసం పోటీ కూడా ఇవ్వలేక చతికలపడింది. మూడు, ఐదో స్థానాలకే పరిమితమైంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోలార్, చింతామణి, ముల్బగల్, గౌరీబిదనూర్, బాగేపల్లి, చిక్కబల్లాపూర్ నియోజకవర్గాల్లో బీజేపీ తరఫున బండి సంజయ్ ప్రచారం చేశారు. ఆయా నియోజకవర్గాల్లో వీధివీధి తిరుగుతూ మోదీ గురించి, బీజేపీ గురించి ఎప్పటిలాగే గొప్పలు చెప్పుకొచ్చారు. కానీ బండి సంజయ్ బీరాల గురించి అర్థమైన కర్ణాటక ప్రజలు బీజేపీకి చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారు. ఆయన ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో కాషాయ పార్టీని దారుణంగా ఓడించారు. దీంతో గెలుస్తుందని నమ్మకం పెట్టుకున్న ప్లేసుల్లో గెలవడం అటుంచితే కనీసం రెండో స్థానంలో కూడా నిలబడలేకపోయింది. బండి ప్రచారం చేసిన కోలార్, చింతామణి, ముల్బగల్ స్థానాల్లో బీజేపీ మూడో స్థానంలోనే ఆగిపోయింది. గౌరీబిదనూర్లో అయితే ఏకంగా ఐదో స్థానానికి పడిపోయింది. బాగేపల్లి, చిక్కబల్లాపూర్లో కూడా బీజేపీ ఓటమి పాలైంది. ఈ విషయం ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది. బండి సంజయ్ ప్రచారం అంటే అట్లుంటది అని నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోవిధంగా కామెంట్లు పెడుతున్నారు.
Karnataka Assembly Election Results 2023 | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్