హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తేతెలంగాణ)/రామగిరి : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించేదాక కళాశాలలను నిరవధికంగా బంద్ చేస్తామని రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జ సూర్యనారాయణ,కార్యదర్శి యాద రామకృష్ణ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడినల్లగొండ జిల్లాలో సోమవారం 76 కాలేజీలను తెరువలేదు. నల్లగొండలో అన్ని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలను బంద్ చేసి.. రామగిరిలోని నీలగిరి డిగ్రీ, పీజీ కళాశాల వద్ద నిరసన తెలిపాయి.
కాలేజీల బంద్ వద్దు : కృష్ణయ్య
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల రాలేదని యాజమాన్యాలు చేపట్టిన కాలేజీల బంద్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రభు త్వం తక్షణం బకాయిలను విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సోమవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.