హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ నిర్మాత, విశ్వమానవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేదర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న హైదరాబాదులో నిర్వహిస్తున్న మహా విగ్రహావిష్కరణకు రాష్ట్ర నలుమూలల నుంచి దళిత బహుజనులు పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర అంబేదర్ యువజన సంఘం అధ్యక్షుడు, ఉస్మానియా యూనివర్సిటీ జాక్ అధ్యక్షుడు బండారు వీరబాబు పిలుపునిచ్చారు. బుధవారం అంబేదర్ మహా విగ్రహావిషరణ గోడపత్రికను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆవిషరించారు. ఈ సందర్భంగా బండారు వీరబాబు మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిదాత, న్యాయకోవిదుడు అంబేదర్ రాజ్యాంగం వల్లనే నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని తెలిపారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత దళితుల కోసం అంబేదర్ ఆశయాల కోసం నిరంతరం కృషి చేస్తున్న అభినవ అంబేదర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అంబేదర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రతీక అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సచివాలయానికి అంబేదర్ పేరు పెట్టిన కేసీఆర్కు యావత్ భారతదేశం రుణపడి ఉంటుందని తెలిపారు. ఈ గోడ పత్రిక ఆవిషరణలో బీఆర్ఎస్ నాయకులు మంద సురేష్ , భరత్ కుమార్, మహేష్, అజయ్, రాష్ట్ర అంబేదర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.