కాప్రా, ఏప్రిల్ 23 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్స వ సభను విజయవంతం చేయాల ని కోరుతూ బుధవారం ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని ఏఎస్రావు నగర్ డివిజన్ జమ్మిగడ్డలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషా సోమశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంటింటికీ సభ ఆహ్వాన పత్రికలను అందజేస్తూ, బొట్టుపెట్టి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రజలంతా బీఆర్ఎస్ పాలన రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు మేలు జరిగింద ని తెలిపారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, కాసం మహిపాల్‌రెడ్డి, బేతాల బాలరాజు, షేర్ మణె మ్మ, కుమారస్వామి, లక్ష్మీనారాయణ తదితరులున్నారు.
మిర్యాలగూడ(మాడ్గులపల్లి), ఏప్రిల్ 23 : తమకు డబ్బు, మందు వద్దని, రజతోత్సవ మహాసభ చూసే భాగ్యం కల్పించాలని కోరుతూ నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం గుర్రప్పగూడెంకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కేసీఆర్‌కు లేఖ రాశారు. తమ గ్రామం నుంచి 200 మందిని తీసుకెళ్లే విధంగా రవాణా సౌకర్యం కల్పించాలని లేఖలో కోరాడు.