చిక్కడపల్లి, ఆగస్టు 12: మాజీ అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తండ్రి, రిటైర్డ్ జడ్జి బండ శ్రీహరి (92) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే ముఠాగోపాల్ బాగ్‌లింగంపల్లిలో శ్రీహరి భౌతిక దేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్‌రావు, యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, నాయకులు దామోదర్‌రెడ్డి, శంకర్ ముదిరాజ్, ముచ్చకుర్తి ప్రభాకర్, ఆర్ వివేక్, శ్రీధర్‌రెడ్డి, కల్యాణ్ నాయక్, ముదిగొండ మురళి, గోపీ, రాజు, టీవీ రాజు తదితరులు పాల్గొన్నారు. అంబర్పేట్ శ్మశాన వాటికిలో అంత్యక్రియలు జరిగాయి.