హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): బనకచర్ల ప్రాజెక్టు ఎవరికి ప్రయోజనం చేకూర్చని పనికిరాని ప్రాజెక్టు అని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు అన్నారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును ముందుకు తెస్తుందని విమర్శించారు.
ఆదివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. బనకచర్ల ప్రాజెక్టుపై అనేకమంది ఇంజినీర్లు, నిపుణులు అభ్యంతరాలు తెలుపుతున్నప్పటికీ లింక్ ప్రాజెక్టుపై అనవసరమైన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుందని మండిపడ్డారు.