హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గుట్కా, పాన్మసాలాలపై నిషేధం విధిస్తూ ఫుడ్ సేఫ్టీ విభాగం ఆదేశాలు జారీ చేసింది. గుట్కాల ఉత్పత్తి, నిల్వ, రవాణా, సరఫరాను ఏడాది పాటు నిషేధిస్తున్నట్టు పేర్కొన్నది. నిబంధనలను అతిక్రమించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.