Balka Suman | విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్న చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి..సీఈఓకు ఫిర్యాదు చేసిన బాల్క సుమన్
Balka Suman | చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి (Congress candidate Vivek) విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని సీఈఓ వికాస్ రాజ్(Election Commission)కు ఫిర్యాదు చేసినట్లు చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్(Balka Suman )తెలిపారు.
హైదరాబాద్ : చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి(Congress candidate Vivek) విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని సీఈఓ వికాస్ రాజ్(Election Commission)కు ఫిర్యాదు చేసినట్లు చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్(Balka Suman )తెలిపారు. వివేక్ కంపెనీ నుంచి ఒక సూట్ కేసు కంపెనీకి సోమవారం ఎనిమిది కోట్లు బదిలీ చేశారని, సూట్ కేసు కంపెనీలో ఇద్దరు డైరెక్టర్లు వివేక్ కంపెనీ ఉద్యోగులు ఉన్నారని వివరించారు. ఆ కంపెనీ రామగుండంలో వివేక్ ఇంటి చిరునామా పైనే ఉందన్నారు.
ఈ ఖాతాను ఫ్రీజ్ చేయాలని కోరినట్లు మీడియాతో తెలిపారు. త్వరలోనే ఈడీ, ఆదాయ పన్ను శాఖలకు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. వివేక్, కుటుంబ సభ్యులు, కంపెనీలు, బంధువుల బ్యాంకు ఖాతాల పై నిఘా పెట్టాలని కోరాం. వివేక్ కంపెనీల నుంచి స్థానిక వ్యాపారులకు డబ్బులు పంపుతున్నారు. వివేక్ పాపంలో పాలు పంచుకోవద్దని స్థానిక వ్యాపారులను కోరుతున్నాం.
డబ్బు అహంకారంతో వివేక్ నేతలను హరాజ్ పాటలో కొనుగోలు చేస్తున్నారు. అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చే వ్యక్తులకు ప్రజలు తగిన బుద్ది చెప్పాలని ప్రజలను కోరారు. వివేక్ కుటుంబం హయాంలో..బీఆర్ఎస్ హయాంలో చెన్నూరు అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్నారు. ఆయనకు సంస్కారం లేదు. అలా మేము వ్యవహరించలేమని స్పష్టం చేశారు. అందుకే సీఈవోకు ఆధారాలతో సహా పిర్యాదు చేశామని బాల్క సుమన్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

