భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్‌రాం వర్ధంతి సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. బాలానగర్‌లోని ఫ్లైఓవర్‌కు ఆయన పేరు పెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
సామాజిక న్యాయం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప నాయకుడి సేవలు భావితరాలకు తెలిపి, ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
– హైదరాబాద్ సిటీబ్యూరో