హైదరాబాద్ : గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులు శ్రీకృష్ణ ప్రియ కుదరవల్లి, తరుణ్ కోన పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కృష్ణప్రియ, తరుణ్ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతుగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనాలని కాంటినేంటల్ హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ గుర్నాథ్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ రఘునాథరెడ్డికి కృష్ణ ప్రియ చాలెంజ్ విసిరారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయి ప్రణీత్‌కి తరుణ్ కోన చాలెంజ్ విసిరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, కృష్ణప్రియ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని శ్రీ కృష్ణప్రియ కుదరవల్లికి, తరుణ్ కోనకు అందజేశారు.