హైదరాబాద్, అక్టోబర్ ౧౩ (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని తక్షీల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ డైరెక్టర్లు నిర్మల్ కోటేచా, పవన్ కుచనా, కిశోర్ తపాడియాను మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు.
ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా తక్షీల్కు వచ్చిన రూ.౮౦.౫౦ కోట్ల నుంచి రూ.౩౪.౫౦ కోట్లను నిబంధనలకు విరుద్ధంగా అమెరికాలోని పవన్ కుచనా సంస్థలకు మళ్లించినట్టు ఆధారాలు లభించడంతో ఈడీ అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో రిపబ్లిక్ ఆఫ్ వనాటు, అమెరికాలో తలదాచుకున్న ఆ ముగ్గురు డైరెక్టర్లను అరెస్టు చేసి, నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. వారిని ఈ నెల ౨౫ వరకు జ్యుడిషల్ కస్టడీలో ఉంచాలని కోర్టు ఆదేశించింది.