హైదరాబాద్, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ)/వ్యవసాయ యూనివర్సిటీ : ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక కోటా కింద బీఎస్సీ(ఆనర్స్)లో అదనంగా 200 సీట్లను పెంచుతున్నట్టు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ప్రకటించారు.
ఈ విద్యా సంవత్సరం నుంచే అమలుచేయనున్నట్లు తెలిపారు. దీంతోపాటు ప్రత్యేక కోటా బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ కోర్సు నాలుగేండ్ల ఫీజును రూ.10 లక్షల నుంచి 5 లక్షలకు తగ్గించినట్టు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.