హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి దేవాలయ అభివృద్ధికి విరాళాలు భారీగా వస్తున్నాయి. అయ్యప్ప ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ రూ. 1,16,00,000లను యాదాద్రి ఆలయ అభివృద్ధికి విరాళంగా ఇచ్చింది.
ఈ విరాళానికి సంబంధించిన చెక్కును మంత్రి కేటీఆర్కు అయ్యప్ప ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి వర్మ అందించారు. ఈ సందర్భంగా రవి వర్మను కేటీఆర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేశ్ బిగాల పాల్గొన్నారు.