హైదరాబాద్, జూన్ 5 (నమస్తేతెలంగాణ): పాఠశాల విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యం పెరుగాలని తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ డైరెక్టర్, సీసీఎఫ్ ప్రియాంకా వర్గీస్ పేరొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ(టీజీఎస్ఎఫ్ఏ) ఆధ్వర్యంలో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ, వాతావరణ మార్పులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం వీడియోల ద్వారా ప్రదర్శన, ఉపన్యాస పోటీలు, పాములపై అవగాహన కల్పించారు. మొకలు నాటడం, నీటిని పొదుపుగా వినియోగించడంపై విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.