హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)కు అవార్డుల పంట పండింది. సహకార బ్యాంకులకు ఏటా నాఫ్కాబ్ అందించే అవార్డుల్లో టెస్కాబ్ 2020-21 సంవత్సరానికి ప్రథమ బహుమతిని, 2021-22 ఏడాదికి ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నది. టెస్కాబ్ శిక్షణ సంస్థకు 2020-21, 2021-22లో ప్రథమ బహుమతి లభించింది.
జిల్లా సహకార బ్యాంకుల విభాగంలో కరీంనగర్ జిల్లా సహకార బ్యాంకుకు ఉత్తమ బ్యాంక్ అవార్డు, ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకుల విభాగంలో చొప్పదండి ప్యాక్స్‌కు ప్రథమ బహుమతి లభించింది. నాఫ్కాబ్ ఈ నెల 26న రాజస్థాన్‌లో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నది.