హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం 27 ఉత్తమ గ్రామపంచాయతీలకు 31న అవార్డులు ప్రదానం చేయనున్నది. పేదరికం లేని మెరుగైన జీవనోపాధులున్న గ్రామం, చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామం, మహిళా స్నేహపూర్వక పంచాయతీ, సుపరిపాలనా గ్రామం, ఆరోగ్యకరమైన పంచాయతీ, స్వయం సమృద్ధి, మౌలిక సదుపాయాలున్న గ్రామం, సామాజిక భద్రత ఉన్న గ్రామం, పచ్చదనం, పరిశుభ్రత ఉన్న గ్రామం, నీరు సమృద్ధిగా ఉన్న గ్రామం.. ఇలా 9 క్యాటగిరీల కింద రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రామపంచాయతీలను ఎంపిక చేస్తారు. ఒక్కో క్యాటగిరీ కింద మూడు గ్రామపంచాయతీల చొప్పున మొత్తం 27 పంచాయతీలను ప్రభుత్వం ఎంపిక చేసింది. 31న మధ్యాహ్నం రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీ ఆడిటోరియంలో జరిగే సమావేశంలో ఉత్తమ పంచాయతీల సర్పంచ్లు, గ్రామకార్యదర్శులను సన్మానిస్తారు.