సంగారెడ్డి, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో రిసెర్చ్ ఎక్సలెన్స్ అవార్డులను అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఐదుగురు విద్యార్థులకు మంగళవారం అందజేశారు. ఐఐటీ హైదరాబాద్‌లో 2016 బ్యాచ్ మెకానికల్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ శాఖ నుంచి డ్యూయల్ డిగ్రీ గ్రాడ్యుయేట్ సజల్ సాగర్సింగ్ తన పీహెచ్డీ సలహాదారు ప్రొఫెసర్ ఖలీల్ నజాఫీ పేరుతో ఎక్సలెన్స్ అవార్డును ఏర్పాటు చేశారు. దానిని ఐఐటీ విద్యార్థి జీ హేమజ అందుకున్నారు. 2018 బ్యాచ్ ఐఐటీ పూర్వ విద్యార్థులు గౌతమ్ వీరమాచినేని, అనన్య అగర్వాల్, సౌమిత్రి ఖానాలే వీఏకే యూజీ ఎక్సలెన్స్ అవార్డును ఏర్పాటు చేశారు. ఈ అవార్డును సౌర్యగాలి అందుకున్నారు. 2012 కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఐఐటీ పూర్వవిద్యార్థులు డాక్టర్ ప్ర శాంత్ పీహెచ్డీ సలహాదారు వివేక్ సర్కార్, డాక్టర్ రత్న సర్కార్‌తో కలిసి ప్రొఫెసర్ కేశవనోరి జ్ఞాపకార్థం కేశవ్ నోరి రిసెర్చ్ ఎక్సలెన్స్ అ వార్డును ఏర్పాటు చేశారు. దీనిని ఐఐటీ విద్యార్థులు దేసు సూర్యసాయితేజ, నీలేశ్ రాజేంద్రషా అందుకున్నారు. 2015 మెకానికల్ అండ్ ఏరోస్సేస్ ఇంజినీరింగ్ విభాగం పూర్వ విద్యార్థి అశ్విన్నంద పుర్కర్ ఐఐటీ విద్యార్థులకు కోసం ఫైనాన్షియల్ ఇండిపెండె న్స్ స్కాలర్షిప్ అవార్డును ప్రారంభించారు. దీనిని శంతను పాండే అందుకున్నారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి, ఐఐటీ అకడమిక్ డీన్ ప్రొఫెసర్ సప్తర్షి మజుందార్ తదితరులు పాల్గొన్నారు.