నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 5 : కమ్యూనిస్టు యోధుడు, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య.. చింతలపల్లి నిర్మలాదేవి నారాయణరావు జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో సీఎన్ఆర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈ అవార్డును గుమ్మడికి ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, సీపీఐ, సీపీఎం నాయకులు ప్రదానం చేశారు.
చింతలపల్లి భాస్కర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన సభలో నర్సయ్యను సత్కరించి మెమెంటోపాటు రూ.25 వేల నగదు అందజేశారు.