ఖమ్మం : ఆటోడ్రైవర్ల పట్ల ఐఎన్టీయూసీ వైఖరిని నిరసిస్తూ ఆటోవర్కర్స్ యూనియన్ జిల్లా, నగర కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని (Khammam) కాంగ్రెస్ జిల్లా కార్యాలయం(సంజీవ్‌రెడ్డి భవనం) వద్ద(Congress office) నిరసన(Autodrivers protest) వ్యక్తంచేశారు. ఆదివారం సంజీవ్‌రెడ్డి భవనంలో జరిగిన ఆటోవర్కర్స్ యూనియన్ సమావేశాన్ని ఆటో కార్మికులు బహిష్కరించి పెద్దఎత్తున ఆందోళన చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించకుండా కొత్తవారికి యూనియన్ బాధ్యతలు ఇస్తామనడంపై కార్మికులంతా మండిపడ్డారు.
యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా విప్లవ్కుమార్నే కొనసాగించాలని నాయకులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నగర ఉపాధ్యక్షుడు గయజ్ పాషా మాట్లాడుతూ తనపై నగర అధ్యక్షుడు నరాల నరేశ్ కొంతమందిని హత్యకు పురమాయించాడని ఆరోపించాడు. ఈ విషయాన్ని జిల్లా కమిటీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోయాడు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రెండువర్గాలుగా విడిపోయిన ఆటో కార్మికులు పెద్దఎత్తున నినాదాలు చేశారు.