హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబరు 7(నమస్తే తెలంగాణ): రూ.5 లక్షల ప్రమాదబీమా రెన్యూవల్ చేయించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని ఆటో యూనియన్ల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను బీఆర్టీయూ అధ్యక్షుడు వేముల మారయ్య, ఏఐటీయూసీ నేత వెంకటేశం, టీఏడీయూ నేత సత్తిరెడ్డి తదితర జేఏసీ నాయకులు శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు.
ఇండస్ట్రియల్ ఆయిల్ కార్పొరేషన్‌పై హైకోర్టు ఆగ్రహం ; కోర్టును మోసగించినందుకు రూ.5 లక్షల జరిమానా
హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఇండస్ట్రియల్ ఆయిల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగిలోని రూ.200 కోట్ల విలువైన రెండెకరాల భూమి విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలన్న మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ధరణి పోర్టల్‌లో పట్టాదారు పేరును మార్చడం చట్టవిరుద్ధమని తేల్చి చెప్పింది. నార్సింగిలోని సర్వే నంబర్ 310/4/1లో పట్టాదారుగా ఉన్న ఏషియన్ ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరును తొలగించి రెవెన్యూ అధికారుల సాయంతో ఇండస్ట్రియల్ ఆయిల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట పాస్‌బుక్‌ను పొందడాన్ని తప్పుబట్టింది. ఈ చర్య కోర్టు అధికారాన్ని తకువ చేయడం, వాస్తవాలను తొక్కిపెట్టి కోర్టును మోసగించడం కిందికే వస్తుందని పేర్కొంటూ రూ.5 లక్షల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి చెల్లించాలని ఇండస్ట్రియల్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఆదేశించింది. ఈ మ్యుటేషన్‌కు బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని, ఆ రెండెకరాల భూమికి పట్టాదారుగా ఏషియన్ ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరును పునరుద్ధరించాలని రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శికి స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ఇటీవల ఆదేశాలు జారీ చేశారుచేశారు.