ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 7 : చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఓ ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గొల్లపల్లిలోని కేసీఆర్ డబుల్బెడ్రూం కాలనీకి చెందిన పాటి సురేందర్(45) ట్రాలీ ఆటో న డుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం భోజనం చేస్తుండగా చికెన్ ముక్క గొంతులో తట్టుకుంది. దానిని తీసే క్రమంలోనే శ్వాస ఆడక మృతిచెందాడు.
హైదరాబాద్, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ) ఈనెల 9 నుంచి ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకొని అన్ని జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణకు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు సముచితమైన రీతిలో ఆవిష్కరణలు జరగాలని సూచించారు.