కొమురవెల్లి, జనవరి 3 : ఆర్థిక ఇబ్బందులతో ఆటోడ్రైవర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం మర్రిముచ్చాలలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు వివరాల ప్రకారం.. మర్రిముచ్చాలకు చెందిన తలారి బాల్నర్సయ్య 15 ఏండ్ల నుంచి ఆటో నడుపుతూ జీవనం గడుపుతున్నాడు. అంతంతమాత్రంగానే ఆదాయం వస్తుండడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన బాల్నర్సయ్య శుక్రవారం ఇంట్లో ఫ్య్యాన్కు ఉరి వేసుకున్నాడు. మృతుడి కుమారుడు హరీశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కొమురవెల్లి ఎస్సై రాజు తెలిపారు.