హనుమకొండ చౌరస్తా, మార్చి 9 : హనుమకొండలోని కుడా హయగ్రీవాచారి గ్రౌండ్లో ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటోషో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. రెండ్రోజులపాటు నిర్వహించిన షోలో ప్రముఖ కంపెనీలకు చెందిన కార్లు, బైక్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు, స్కూటర్లను ప్రదర్శనలో ఉంచారు. మారుతి సుజుకి, స్కోడా, విన్ టీవీఎస్, విన్ మోటార్స్, కియా మోటార్స్, ఆదర్శ మోటార్స్, ఆదర్శ నెక్సా, గ్రీన్ హోండా, హ్యాపీ ఆటోమోటివ్ యమహా, ప్రైడ్ సిట్రోన్, రాంగ్రూప్ ఎంజీ 100 యాజమాన్యాలు తమ లేటెస్ట్ కార్లు, బైక్‌లను ప్రదర్శనలో ఉంచాయి. వాహనదారుల కోసం ప్రత్యేక ఆఫర్లు, రాయితీపై పాత వాహనాలకు కొత్త వాహనాలు అందించేందుకు ముందుకొచ్చాయి. ఆదర్శ ఆటోమోటివ్స్(మారుతి సుజుకి), ఆదర్శ ఆటోవరల్డ్(నెక్సా), మహావీర్ స్కోడా, మాలిక్ కియా, రామ్గ్రూప్ ఎంజీ100, సిట్రోన్, హోండా, నియోన్ హుందాయ్, విన్ మోటార్స్, ఆదర్శ టీవీఎస్, ఆరుష్ ఆటోమోటివ్స్(ఏథర్), హ్యాపీ ఆటోమోటివ్స్(యమహా), చేతక్, రాయల్ ఎన్ఫీల్డ్డ్(ఎస్వీ మోటార్స్), విన్ మోటార్స్(టీవీఎస్), ఐఆర్ఈవీ బైక్స్, ప్రణవ్ మోటార్స్, డీసీసీ బ్యాంక్ ప్రదర్శనతోపాటు బ్యాంకు రుణ సౌకర్యం అందుబాటులో ఉంచడంతో వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు.
ఆటోషోలో ప్రముఖ కంపెనీలకు చెందిన కార్లు, బైకులను టెస్ట్ డ్రైవ్ కోసం రయ్.. రయ్‌మంటూ చక్కర్లు కొట్టారు. తమకు నచ్చిన కార్లు, బైకుల గురించి తెలుసుకుని పెద్దఎత్తున కొనుగోలు చేశారు. ఆటో షోలో తమకు ఇష్టమైన వాహనాలను అందుబాటులో ఉంచడంతో ‘నమస్తేతెలంగాణ-తెలంగాణ టుడే’కు కృతజ్ఞతలు తెలిపారు. ముగింపు కార్యక్రమానికి శాసనమండలిలో విపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. ఉద్యమనేత కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దారని కొనియాడారు. రాష్ర్టాన్ని సాధించడంలో ‘నమస్తే తెలంగాణ’ గుణాత్మకపాత్ర పోషించడంతోపాటు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ రోజుల్లో వాహనం ప్రతి ఒక్కరికీ నిత్యావసరంగా మారిందని పేర్కొన్నారు. మాజీ మంత్రి యర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. ‘నమసే ్తతెలంగాణ’ తెలంగాణ గుండె చప్పుడు అని పేర్కొన్నారు. వివిధ సంస్థలు కొత్త కొత్త కార్లు, బైకులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు.
గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన ‘నమస్తే తెలంగాణ-తెలంగాణటుడే’కు అభినందనలు తెలిపారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నమనేని జగన్మోహన్రావు మాట్లాడుతూ.. ‘నమస్తేతెలంగాణ-తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ఆటోషో ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్‌లో ఇలాంటి ఆటోషోలు నిర్వహించడం వినియోగదారులకు గొప్ప వరమని కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి పేర్కొన్నారు. అనంతరం స్టాళ్ల సందర్శనకు వచ్చినవారికి ప్రోత్సాహక బహుమతులు, స్టాళ్లను ఏర్పాటుచేసిన కంపెనీ ప్రతినిధులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ పందిళ్ల అశోక్‌కుమార్, బ్యూరో ఇన్చార్జి పిన్నింటి గోపాల్, మార్కెటింగ్ మేనేజర్ అప్పని సూరయ్య, సర్క్యులేషన్ మేనేజర్ ఎడెల్లి సురేశ్‌రెడ్డి, ఆదర్శ ఆటోమోటివ్స్ జనరల్ మేనేజర్ కేఎస్ కల్యాణ్, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వరంగల్ కార్యదర్శి పీఎస్ ఫణికుమార్, హనుమకొండ కార్యదర్శి డాక్టర్ సీహెచ్ ప్రవీణ్‌కుమార్, ఉపాధ్యక్షులు రఘుపతిరెడ్డి, సురేశ్‌కుమార్, కృష్ణార్జునరావు, మధుసూదన్‌రెడ్డి, కార్తీక్ పాల్గొన్నారు.
కరీంనగర్ ప్రాపర్టీషోకు అనూహ్య స్పందన..
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో రెండ్రోజులపాటు నిర్వహించిన ప్రాపర్టీ షోకు అనూహ్య స్పందన లభించింది. షోకు నగరంతోపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ప్రాపర్టీల వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. రాష్ట్రంలోని పలు ప్రముఖ సంస్థలతో పాటు జిల్లాకు చెందిన వివిధ రియల్ సంస్థలు, బిల్డర్స్, బ్యాంకులు, సోలార్ సంస్థలు, బ్యాంకులు స్టాల్స్ ఏర్పాటుచేయగా విశేష స్పందన లభించింది. రెండ్రోజుల్లో సుమారు 1200 మంది సందర్శించారు. పలువురు వినియోగదారులు తమకు నచ్చిన వాటిని బుక్ చేసుకున్నారు. ఈ షోను శనివారం కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ ప్రారంభించగా, ఆదివారం ముగింపు కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్ ఆంజనేయులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్రావు, బండ గోపాల్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇలాంటి షోలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో కరీంనగర్లో ప్రాపర్టీ షో నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ కరీంనగర్ బ్రాంచి మేనేజర్, బ్యూరో ఇన్చార్జి కే ప్రకాశ్‌రావు, యాడ్స్ మేనేజర్ రేణ మల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
నిజామాబాద్‌లో భారీగా సందర్శకులు..
ఖలీల్‌వాడి: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వేణుమాల్లో ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రాపర్టీ షో ఆదివారం ముగిసింది. ప్రాపర్టీ షో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నిజామాబాద్, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ డెవలపర్స్, రియల్ ఎస్టేట్ సంస్థలు తరలివచ్చాయి. పెద్దసంఖ్యలో తరలివచ్చిన సందర్శకులు తమకు ఇష్టమైన ప్రాపర్టీల కొనుగోలుకు ఆసక్తిచూపారు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించిన ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ను సందర్శకులు అభినందించారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ధర్మరాజు, బ్యూరో ఇన్చార్జి రమేశ్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.