ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 12: ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్‌పై ఓయూ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. అధికారుల తీరుపై అధ్యాపకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధ్యాపకుల సమస్యలపై పోరాడుతున్నందుకే మనోహర్‌పై కక్ష గట్టారని మండిపడుతున్నారు. వీసీ, అధికారుల అనాలోచిత నిర్ణయాలను నిరసిస్తూ పెద్దఎత్తున ఉద్యమించేందుకు సిద్ధమని తేల్చిచెప్తున్నారు. ఈ అంశంపై వర్సిటీ రిజిస్ట్రార్‌ను ఫోన్లో సంప్రదించేందుకు నమస్తే తెలంగాణ ప్రతినిధి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ వ్యవహారశైలిపై ఇటీవలే ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో ‘సాటి అధ్యాపకులపై కక్షగట్టిన వీసీ’ పేరుతో కథనం ప్రచురితమైం ది. ఓయూ అధ్యాపకుల ప్రమోషన్ల గురించి గవర్నర్‌కు ఔటా ఫిర్యాదు, వీసీ వ్యవహారశైలిని బయటపెట్టింది.
సమస్యలపై మాట్లాడితే వేటు వేస్తరా?
ఇటీవల ఓయూ వీసీ, అధికారులపై ఔటా ప్రతినిధులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. వీసీ ఏకపక్ష ఆదేశాలు పాటించకపోతే అధ్యాపకులను బెదిరింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. పారదర్శకంగా, జవాబుదారీగా ఉండాల్సిన వర్సిటీ పాలనను విచ్ఛిన్నం చేస్తున్నారని వివరించారు. అధికారిక, చట్టబ ఈ నేపథ్యంలో ఔటా ఫిర్యాదు కారణంగానే వీసీ, అధికారులు ప్రొఫెసర్ మనోహర్‌ను సస్పెండ్ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇంట ర్వ్యూ బోర్డులో ముందస్తు సంతకాలు తీసుకోవడాన్ని మనోహర్ ప్రశ్నించారని, అధ్యాపకులకు ప్రమోషన్లు కల్పించాలనే డిమాండ్‌తో ర్యాలీ తీశారని తెలిపారు. అధికారుల మెమోలకు సరైన సమాధానం ఇచ్చినా ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేశారని మనోహర్ వాపోయారు.