హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూలో శనివారం నిర్వహించిన 14వ స్నాతకోత్సవంలో అరబిందో ఫార్మా లిమిటెడ్, హోల్టైమ్ డైరెక్టర్ మెట్టు మదన్మోహన్రెడ్డికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫార్మా స్యూటికల్ పరిశ్రమకు నిరంతరం చేసిన కృషికి ఆయనకు డాక్టరేట్ దక్కింది. స్నాతకోత్సవంలో మొత్తం 82,547 మంది విద్యార్థులకు పట్టాలు అందించగా, వాటిలో 15 విభాగాల నుంచి 87 మంది డాక్టరేట్ పొందారు. మొత్తం 71 బంగారు పతకాలు విద్యార్థులకు అందించినట్టు వీసీ ప్రొఫెసర్ కే కిషన్కుమార్రెడ్డి తెలిపారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(వర్సిటీ చాన్స్లర్) ఈ కార్యక్రమానికి హాజరు కావలసి ఉండగా, హాజరు కాలేదు.