హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): కేంద్ర జల్ సంఘం (సీడబ్ల్యూసీ)చైర్మన్‌గా అతుల్‌జైన్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రజలశక్తిశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీడబ్ల్యూసీ చైర్మన్‌గా కొనసాగుతున్న ఎంకే సిన్హా పదవీ విరమణ పొందుతున్న నేపథ్యంలో ఆయన స్థానంలో అతుల్‌జైన్‌ను కేంద్రం నియమించింది. అతుల్‌జైన్ ప్రస్తుతం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్‌గా కొనసాగుతున్నారు. సీడబ్ల్యూసీ చైర్మన్‌గా అతుల్‌జైన్ నియామకంతో బోర్డు అధికారులు, ఎన్‌డబ్ల్యూడీఏ ఇంజినీర్ దేవేందర్‌రావు తదితరులు హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్ అతుల్‌జైన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.