ఇనుగుర్తి, జూలై 17 : గురుకుల ప్రిన్సిపాల్ వేధింపులు తట్టుకోలేక మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకులం అటెండర్ లక్ష్మి శుక్రవారం ఆ త్మహత్యకు యత్నించింది. ప్రిన్సిపాల్ జయశ్రీ తన తల్లి, మనుమడిని గురుకులంలోని క్వార్టర్‌కు తీసుకొచ్చుకొని వారి పనులన్నీ చేయిస్తున్నదని లక్ష్మి కన్నీటి పర్యంతమైంది. మెస్‌కు పంపి నూనె ప్యాకెట్లు, స్నాక్స్ తేవాలని వేధిస్తున్నదని, చెప్పినట్టు తేకపోతే మెమో ఇస్తానని బెదిరిస్తున్నదని వాపోయింది. దీంతో పారాసిటామల్ మాత్రలు మింగింది.
గురుకుల సిబ్బంది గ మనించి 108లో మ హబూబాబాద్ ఏరి యా వైద్యశాలకు తరలించారు ప్రస్తుతం ఆ రోగ్యం నిలకడగానే ఉ న్నదని కుటుంబ స భ్యులు తెలిపారు. కాగా, వేధింపులకు గురిచేస్తున్న ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేసింది.