TSPSC | హైదరాబాద్: టీఎస్పీఎస్సీ 2022 గ్రూప్-2, గ్రూప్-3 నోటిఫికేషన్లలో అదనపు పోస్టులను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. గ్రూప్-1 మాదిరే ఈ రెండు ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ అదనపు పోస్టులు కలపాలనేది ప్రభుత్వ యోచన అని సమాచారం.
2022 గ్రూప్-2 నోటిఫికేషన్లో కటాఫ్ తేదీ ప్రకారం 18 విభాగాల్లో 783 ఖాళీలను చూపారు. ఇప్పటివరకు పెరిగిన పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వ నున్నదని తెలిసింది. 2022 డిసెంబర్ 30న విడుదలైన గ్రూప్-3 అదనపు ఖాళీ పోస్టులు కలుపుకొని అనుబంధ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. గ్రూప్-3లో ప్రస్తుతం 1375 ఖాళీలు ఉన్నాయి.ర