హైదరాబాద్ : ఫార్మాసిటీపై అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజన రైతులపై కేసు నమోదు చేసిన పోలీసులు మరోసారి దారుణానికి పాల్పడ్డారు. అధికారులపై దాడులకు పాల్పడ్డరాన్న నెపంతో లగచర్లకు(Lagacharla ) చెందిన రైతు హీర్యానాయక్‌తో పాటు మరికొందరు రైతులను (Heeryanaik) అరెస్టు చేసి జైలులో ఉంచి విషయం తెలిసిందే.
కాగా హీర్యానాయక్‌కు గురువారం గుండె సమస్యరావడంతో అతడికి సంకెళ్ళ తోనే (Hand Cuffs) జైలు సిబ్బంది సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి 2డీ ఈకో పరీక్షలు నిర్వహించారు. సంకెళ్లు వేసి తీసుకురావడం భావ్యంకాదని గతంలో కోర్టులు తీర్పు చెప్పినా కూడా పోలీసులు రైతు హీర్యానాయక్‌కు సంకెళ్లు వేయడం పట్ల పలువురు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి చేరుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. హీర్యా నాయక్ ను పరామర్శించారు.