హైదరాబాద్: దేశం స్వావలంబన సాధించడమే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ సర్కారు ఆర్భాటంగా ప్రారంభించిన ‘ఆత్మ నిర్భర్ భారత్’ పథకం ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ చందంగా మారింది. స్కీమ్ ప్రారంభించి రెండున్నరేండ్లు కావొస్తున్నా.. దేశ భద్రతకు కీలకమైన రక్షణ రంగంలో స్వావలంబన అందని ద్రాక్షగానే మారింది. ఆయుధ దిగుమతుల్లో పొరుగు దేశం పాకిస్థాన్ ఐదో స్థానంలో ఉండగా.. భారత్ ఇప్పటికీ అగ్రస్థానంలో ఉండటమే ఇందుకు నిదర్శనం.
