సూర్యాపేట : ఆత్మకూర్(ఎస్) పోలీసు స్టేషన్ వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులు ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. టీఆర్ఎస్ కార్యకర్తలపైకి బీజేపీ నాయకులు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించారు. బీజేపీ సృష్టించిన ఘర్షణ వాతావరణ నేపథ్యంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో శ్రీనివాస్‌ను సూర్యాపేట ఆస్పత్రికి పోలీసులు తరలించారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై నల్లగొండ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.