కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఇంట్లో విషాదం చోటుచేసింది. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె మహాలక్ష్మి బలవన్మరణానికి పాల్పడింది. గురువారం తెల్లవారుజామున సారపాకలోని స్వగృహంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. వెంకటేశ్వర్లు పెద్ద కుమార్తె అయిన మహాలక్ష్మి ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తిచేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.