హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : పేదింటి బిడ్డ ఉన్నత చదువులకు రూ. 50వేల ఆర్థిక సహాయాన్ని అందించి తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు అండగా నిలిచారు. ములుగు జిల్లాకు చెందిన ఎస్ పల్లవికి ఐఐటీ బాంబేలో సీటు రాగా, ఫీజు చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆమెకు ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ రూ.50వేల సాయం చేసింది.
సోమవారం సచివాలయం మీడియా పాయింట్ వద్ద అసోసియేషన్ అధ్యక్షుడు గాయక్వాడ్ తులసీదాస్ రూ.50వేలను అందజేశారు.