హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): అసిస్టెంట్ ఇంజినీర్స్(ఏఈ), టెక్నికల్ ఆఫీసర్ (టీవో), జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (జేటీవో) పరీక్ష హాల్‌టికెట్లు www.tspsc.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. ఈనెల 18, 19న ఉదయం 10 నుంచి మ.12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయం త్రం 5 వరకు రెండు సెషన్లలో ఆన్లైన్ పద్ధతిలో పరీక్షలుంటాయని వెల్లడించారు.
పరీక్షకు సంబంధించిన మాక్‌టెస్ట్ లింక్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నదని, అభ్యర్థులు ముందుగానే ప్రిపేర్ కావాలని ఆమె సూచించారు. రాష్ట్రంలో 833 ఏఈ, టీవో, జేటీవో ఉద్యోగాల భర్తీకి నిరుడు సెప్టెంబర్ 12న నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ జారీ చేసిన విషయం తెలిసిందే.