హైదరాబాద్, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ): అసిస్టెంట్ ఇంజినీర్స్ (ఏఈ), టెక్నికల్ ఆఫీసర్ (టీవో), జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (జేటీవో) పరీక్షల నిర్వహణకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షలను ఈ నెల 18, 19, 20 తేదీల్లో వరుసగా ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఆర్టీ పద్ధతిలో నిర్వహించనున్నది. 20న జరగాల్సిన మెకానికల్ ఇంజినీర్ పరీక్షను 26కు వాయిదా వేసినట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. పరీక్షలకు 45 నిమిషాల ముందు వరకు www.tspsc.gov.in వెబ్సైట్లో హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.