సుబేదారి, సెప్టెంబర్ 25 : వరంగల్ విద్యాశాఖ వెల్ఫేర్, మౌలిక వసతుల డిపార్ట్మెంట్ జనగామ సబ్ డివిజన్ ఔట్ సోర్సింగ్ సైట్ ఇంజినీర్(ఏవో) సామల రమేశ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా కొడకండ్ల ప్రభుత్వ పాఠశాల సైన్స్ ల్యాబ్ బిల్లుల చెల్లింపు కోసం కాంట్రాక్టర్‌ను ఏవో రమేశ్ రూ.18వేలు లంచం డిమాండ్ చేయగా, సదరు కాంట్రాక్టర్ రూ.10వేలు ఇచ్చాడు.
మిగతా రూ.8వేలు గురువారం హనుమకొండ అదాలత్‌లోని హనుమకొండ జిల్లా ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్యాలయంలో కాంట్రాక్టర్ నుంచి ఏవో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.రమేశ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.