హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): మనీ లాండరింగ్ కేసులో హైదరాబాద్కు చెందిన ఖాదర్ ఉన్నీ సా, మహమ్మద్ మునావర్ ఖాన్కు చెందిన రూ.4.80 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం వెల్లడించారు. బంజారాహిల్స్, టోలీచౌకి, శంషాబాద్లో ఉన్న ఈ ఆస్తులు మహమ్మద్ మునావర్ ఖాన్, అతని భార్య ఫైకా తహా ఖాన్ పేరిట ఉన్నట్టు తెలిపారు. ఫోర్జరీ పత్రాలు సృష్టించడం, రెవెన్యూ రికార్డులను తారుమారు చేయడం ద్వారా ప్రభుత్వ భూమిని అక్రమంగా అమ్మినట్టు నిందితులపై మహేశ్వరం పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ కేసు దర్యాప్తును ప్రారంభించింది. నాగారం గ్రామ సర్వేనంబర్ 181 లోని ప్రభుత్వ/భూదాన్ భూమిని ఖాదర్ ఉన్నీసా, ఆమె కుమారుడు మునావర్ ఖాన్ తమ పూ ర్వీకుల ఆస్తిగా పేరొన్నారని, కొందరు ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై ఫోర్జరీ పత్రాలతో ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రైవేట్ పార్టీలకు విక్రయించారని, తద్వారా నిందితులు నేరపూరితంగా రూ.6.45 కోట్లు సంపాదించారని ఈడీ వెల్లడించింది.
8 నెలల్లో 179 కేసులు ; 167 మందిని అరెస్టు చేసిన ఏసీబీ
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అవినీతిపరులపై ఉక్కుపాదం మోపుతున్న ఏసీబీ.. ఈ ఏడాది తొలి 8 నెలల్లో (ఆగస్టు 31 వరకు) 179 కేసులు నమోదు చేసిం ది. ఈ కేసుల్లో 167 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టి, రిమాండ్ విధించింది. వారి నుంచి రూ.44,30, 35,724 విలువైన అక్రమ ఆస్తులతోపాటు రూ.33,12,500 నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు. గత నెలలోనే 31 కేసులు నమోదుచేసి, 22మంది ప్రభు త్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులను అరె స్టు చేశామని, వారినుంచి రూ.5,13, 75,198 విలువైన అక్రమ ఆస్తులతోపాటు రూ.2,82,500 నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.